రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్ర : ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్

రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్ర : ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్

నిర్మల్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతోం దని, దీన్ని తిప్పికొట్టేందుకు దేశ ప్రజలంతా సిద్ధం కావాలని ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంపై నిర్మల్​లో డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశానికి తాహెర్​చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు.

కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నియంతల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తూ అండగా ఉంటోందన్నారు. కాంగ్రెస్​ను మరింత బలోపేతం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.  

నిర్మల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ అఫ్సర్ యూసుఫ్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు రాంభూపాల్, రుద్ర భాస్కర్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్, నిర్మల్, భైంసా, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీంరెడ్డి, ఆనంద్ రావు పాటిల్, అబ్దుల్ హాది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.